ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన ఊచకోత ఘటన ముస్లిం వ్యతిరేక వాదం ఎలా హింసాత్మకంగా జడలు విప్పి వెర్రితలలు వేస్తోందో చెప్పకనే చెబుతోంది. బ్రెంటన్ హారిసన్ టారంట్ అనే వ్యక్తి ఓ మసీదులోకి చొరబడి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో సుమారు 50 మంది మరణించిన సంఘటన.. ఆ దేశంలో కనీవినీ ఎరుగనిది. ఈ దారుణ దాడికి ముందు ఈ దుండగుడు ఓ మ్యానిఫెస్టో‌ని ఆన్‌లైన్‌లో పెడుతూ.. ముస్లిములంటే తనకెంత ద్వేషమో ప్రకటించాడు,.బ్రిటిష్ ఫాసిస్ట్ ఆస్వాల్డ్ మోస్లే, నార్వే మర్డరర్ ఆండర్స్ బ్రెవిన్ తో బాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా తాను ఆదర్శంగా తీసుకున్నానని అన్నాడు. వీళ్ళను  రెన్యూడ్ సింబల్ ఆఫ్ వైట్ ఐడెంటిటీ  గా అభివర్ణించాడు. న్యూజిలాండ్ ఘటన..ముస్లిముల పట్ల వివక్ష, ద్వేషం అంతకంతకూ పెరుగుతున్న ప్రమాదకర ధోరణిని సూచిస్తోందని అంటున్నారు.

ఇదే ఇస్లామోఫోబియా అట!  న్యూజిలాండ్అ ఘటన జరిగి 24 గంటలైనా గడవకముందే ట్రంప్..’ వైట్ నేషనలిజం డేంజరస్‌గా మారుతోందనే ఆరోపణలను కొట్టి పారేశాడు. ఇక-పలు  దేశాల్లో ఆయా ప్రభుత్వాలు  ముస్లిం వ్యతిరేక పాలసీలు, చట్టాలను ప్రకటిస్తూ.. ముస్లిములను దూరం పెడుతున్నాయి. వారిని, వారి వస్త్ర ధారణను బ్యాన్ చేసేట్టుగా ఈ విదానాలుంటున్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, కెనడా వంటి దేశాలు తమ తమ సొంత పాలసీలతో ఈ జాతి వివక్షకు ఊతమిస్తున్నాయనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

2011 లోనే ఫ్రాన్స్ ప్రభుత్వం ముస్లిం మహిళల బుర్ఖా, నికాబ్ ను నిషేధించింది. జడ్జీలు, టీచర్ల వంటి ప్రొఫెషనల్ వృత్తిలో ఉన్నవారి  మతపరమైన వస్త్ర ధారణ పట్ల ఈ దేశాలు ఆంక్షలు విధించాయి. తమ మతాన్ని  చూపేట్టుగా ఉండే వస్త్రాలను ధరించరాదని  ఆదేశాలు జారీ చేశాయి. ముస్లిం దేశాలు ఈ ప్రమాదకర  పోకడను  ఖండిస్తున్నప్పటికీ.. మెజారిటీ దేశాలు ‘ తెల్లోళ్ళ ‘ పాలనలోనే ఉన్నందున..వీటి నిరసనకు పెద్దగా ప్రాధాన్యత లేకపోతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *