అధ్యక్షుని కూతురుగా వాల్డ్‌లో తనదే అతిపెద్ద జాబ్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా తనమీద తానే సెటైర్ వేసుకుంది. నాకేదో గొప్ప ప్రివిలేజ్ ఉందని మీరంతా (జర్నలిస్టులు) అనుకుంటున్నారు. అలాగే ఈ హోదాలో ఎన్నో పనులు చేస్తుంటానని ప్రజలు కూడా భావిస్తుంటారు. కానీ ఈ ప్రపంచంలో నాకున్న ‘ పెద్ద జాబ్ ‘ ఇదే అంటూ వ్యాఖ్యానించింది. అమెరికన్లలో చాలామందికి గ్యారంటీగా వచ్చే కనీస ఆదాయం అవసరం లేదని ఇటీవల ఈమె చేసిన వ్యాఖ్యలు అపహాస్యం పాలయ్యాయి.

వైట్‌హౌస్‌లో అధ్యక్షుని సలహాదారుగా వ్యవహరిస్తున్న ఇవాంకా.. నాలుగేళ్ళుగా ఈ దేశంలో ఎన్నోచోట్ల తిరిగానని, తమ విధులు, పనులకు గాను తమకు కనీస ఆదాయం లభించాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలపట్ల చాలామంది ఆమెను తప్పు పట్టారు. ప్రజలు తెలివిలేనివాళ్ళు కారని, తమ బాధ్యతలు, విదులేమిటో వారికి తెలుసునని వారు అభిప్రాయపడ్డారు. దీనిపై ఈ నెల 4 న వైట్ హౌస్ లో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో ఇవాంకా మళ్ళీ..తనపై తానే జోకులేసుకుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *