పాదయాత్ర, ఎన్నికల సభలతో బిజీగావున్న వైసీపీ అధినేత జగన్ వారంపాటు రెస్ట్ తీసుకోనున్నారు. ఇందులోభాగంగా జగన్ తన ఫ్యామిలీతో లండన్‌కి వెళ్లారు. అక్కడ చదువుతున్న కూతుర్ని చూసేందుకు వెళ్లిన జగన్ దంపతులు, వారం రోజులపాటు అక్కడే గడపనున్నారు. తిరిగి ఈనెల 27న హైదరాబాద్‌కు రానున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్ బయలుదేరారు.

గత నెలలో జగన్ లండన్ వెళ్లాల్సివున్నా, ఏపీలో రాజకీయాల్లో తలమునకలు కావడంతో టూర్ వాయిదా పడింది. ఇటీవలే తన కూతుర్ని చూసేందుకు బ్రిటన్ వెళ్తున్నానని, తనను అనుమతించాల్సిందిగా కోరుతూ జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. లండన్‌లో పర్యటించే ప్రదేశాలు, ల్యాండ్‌ ఫోన్‌, సెల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌, ఫ్యాక్స్‌ నంబర్‌ తదితర వివరాలను కోర్టుతోపాటు సీబీఐ అధికారులకు సమర్పించాలని మెలిక పెట్టిన విషయం తెల్సిందే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *