2019 బిగ్ ఫైట్ ముంచుకొచ్చెయ్యడంతో ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మైండ్ గేమ్ స్పీడ్ అందుకుంది. ఎవ్వరి పాచికలు వాళ్ళు వేసుకుంటూ.. ఓట్ల వేటలో దూసుకుపోతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర మొదలవకముందే ‘నవరత్నాలు’ పేరుతో తొమ్మిది తాయిలాల్ని ప్రకటించిన జగన్.. వాటి ద్వారా పాదయాత్రలో జనాన్ని మైమరపింప జేయాలని ప్లాన్ చేశారు. ఈ తొమ్మిది సూత్రాల్లో ‘పెన్షన్ మొత్తం రూ. 2 వేలకు పెంచడం’ అనేది కీలకం. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే అవకాశమున్న ఈ ‘పెన్షన్ పెంపు’ను జగన్ బాగా ప్రచారం చేసుకున్నారు. కానీ.. జగన్ పాదయాత్ర అలా ముగిసిందో లేదో చంద్రబాబు.. పెన్షన్ ఐడియాను హైజాక్ చేసేశారు.

నెల్లూరు జిల్లాలో జరిగిన జన్మభూమి కార్యక్రమం వేదికపై చంద్రబాబు చేసిన ‘రూ. 2వేల పెన్షన్’ ప్రకటన వైసీపీని డిఫెన్స్‌లోకి తోసేసింది. ‘జగన్ గెలిస్తే ఇస్తానన్న 2 వేలు నేను ఇప్పుడే ఇస్తున్నా’ అంటూ చంద్రబాబు తీసుకున్న అగ్రెసివ్ స్టెప్.. రాష్ట్ర ఖజానా మీద ఎంత భారం మోపుతుందన్నది అటుంచితే.. 54 లక్షల మంది పేదలకు లబ్ది కలుగుతుందన్నది క్లియర్. బాబు మేజిక్‌‌కి జనం ఫ్లాట్ అయిపోతారన్న ఆందోళనలో వైసీపీ.. కింకర్తవ్యంపై దృష్టి పెట్టింది. రేపోమాపో జగన్ ఈ ఎపిసోడ్‌పై విధాన ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. ఆలోగా.. జగన్ చెప్పబోయే తీపి కబురుపై లీకులిచ్చేసింది ప్రతిపక్ష వైసీపీ.

ఎన్నికలకు కొన్ని నెలల ముందు బాబు ఇలా చేస్తారని జగన్ ముందే చెప్పారంటూ వైసీపీ ‘ఎదురు ప్రచారం’ మొదలుపెట్టేసింది. ‘నవరత్నాలకు మరిన్ని రిపేర్లు’ అంటూ జగన్ మీడియాముందుకొచ్చే లోపే.. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ రూ. 3 వేలకు పెంచడం ఖాయమన్న ఫీలర్ జనంలోకి వచ్చేసింది. సో.. ఒక్కదెబ్బతో వెయ్యి కాస్తా మూడు వేలు కానుంది. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చేలోగా ఇంకెన్ని జాదూగర్‌లు జరుగుతాయన్నది చూడాలి!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *