బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని, మన జాతి వెన్నెముక కులాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం తమ పార్టీ తరఫున నిర్వహించిన ‘ బీసీ గర్జన ‘ సభలో మాట్లాడిన ఆయన.. బీసీలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. బీసీల స్థితిగతులపై ఓ కమిటీ వేశామని, రాష్ట్ర వ్యాప్తంగా తను జరిపిన పాదయాత్ర ద్వారా వారి సమస్యలు తెలుసుకున్నానని పేర్కొన్నారు.

మన నాగరికతను కాపాడిన వ్యక్తులు బీసీలే ! అలాంటివారి బ్రతుకుల్లో మార్పు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వీరికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు దిక్కు లేదని, 119 హామీల అమలు జరగలేదని జగన్ విమర్శించారు. అమలుకు సాధ్యం కాని వాగ్దానాలతో బాబు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన అన్నారు. బీసీలు తిరగబడతారని ఆయనకు భయమన్నారు. ఉన్నత చదువులతోనే బీసీల అభివృద్ది సాధ్యమని జగన్ వ్యాఖ్యానించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *