తన గురించి రకరకాల వార్తల నేపథ్యంలో ఎట్టకేలకు నోరువిప్పారు జగన్ బాబాయ్ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వ్యక్తిగత పనులు, మనశ్శాంతి కోసం తాను విదేశాలకు వెళ్లానని చెప్పుకొచ్చారు. ప్రత్యక్ష రాజకీయాలంటే ఎంతో ఇష్టమని.. తనను పోటీ నుంచి తప్పించడంతో చాలా బాధగా వుందన్నారు. విదేశాల నుంచి గురువారం హైదరాబాద్‌ చేరుకున్న వచ్చిన సుబ్బారెడ్డి.. మీడియా ముందుకు వచ్చేందుకు ముఖం చాటేశారు. కానీ, ఓ ఛానెల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తనను ఎంపీ స్థానానికి పోటీ చేయొద్దని పార్టీ చెప్పిందన్నారు. రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పడంతో బాధ కలిగిందని, ఆ ఆఫర్‌ని తిరస్కరించినట్టు వెల్లడించారు.

ఎన్నికల తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానని, రాజకీయాల నుంచి వైదొలగాలనే ఆలోచన వుందని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు జగన్ బాబాయ్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాకు రాలేనని, చక్కదిద్దుకోవాల్సి పనులు చాలా వున్నాయన్నారు. వైవీ వ్యవహారం ఆ జిల్లాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. గిద్దలూరు, దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో ఆయన మద్దతుదారులు నిరాశలో వున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *