జగిత్యాలలో పట్టపగలు నడిరోడ్డులో దారుణం జరిగింది. భూతగాదా విషయంలో తిప్పర్తి కిషన్‌పై కత్రోజ్ లక్ష్మణ్ అనే వ్యక్తి గొడ్డలితో ఏకధాటిన దాడికి దిగాడు. బైక్ లో గొడ్డలి పెట్టుకొని వచ్చిన లక్ష్మణ్ నడిరోడ్డుపై అంతా చూస్తుండగా కిషన్ పై దాడికి తెగబడ్డాడు. ఐదేళ్లకిందట కిషన్ ఒక భూమిని లక్ష్మణ్ కు అమ్మినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ఆ భూమికి ఎన్నిసార్లు అడిగినా పట్టా చేసివ్వకపోవడం, డబ్బుతిరిగి ఇవ్వమన్నా ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన లక్ష్మణ్ ఈ దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. లక్ష్మణ్ పరారీలో ఉండగా, గాయపడిన కిషన్ ను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *