టీడీపీ అధినేత చంద్రబాబు జమ్మలమడుగు పంచాయితీకి ఎట్టకేలకు శుభం కార్డు వేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చారు. ఆదినారాయణరెడ్డి సోదరులకు తన ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు రామసుబ్బారెడ్డి అంగీకరించారు. దీనికి బదులుగా, రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో కండీషన్ ప్రకారం రామసుబ్బారెడ్డి తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఇకపోతే, ఆదినారాయణరెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారు. ఇటీవల చంద్రబాబు ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య సమోధ్య కుదిర్చేందుకు ఇరువురి నేతల్ని అమరావతికి పిలిచిన సంగతి తెలిసిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *