ఎన్నికల నామినేషన్లను నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించే కార్యక్రమం వేగవంతం చేశాయి. తాజాగా ఏపీలోని మరో 13 శాసనసభ, ఓ లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులను సోమవారం అర్ధరాత్రి ప్రకటించారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.  గాజువాక‌తోపాటు భీమవరం నుంచి కూడా పవన్ బరిలోకి దిగే ఛాన్స్ వున్నట్లు సమాచారం.

రెండో జాబితాలో ఓ అభ్యర్థి స్థానాన్ని మార్చారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించిన షేక్‌రియాజ్‌.. తాజా మార్పులో ఆయన ఒంగోలు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌ పోటీ చేయనున్నారు. తాజాగా జగన్ పార్టీ నుంచి జనసేనలో చేరిన గుణ్ణం నాగబాబుకు పాలకొల్లు టికెట్ దక్కింది. వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా పని చేసిన ఆయన, టికెట్ దక్కకపోవడంతో సోమవారమే జనసేనలో చేరారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *