పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఆర్ టీ ఐ మాజీ కమిషనర్ పి.విజయబాబు రాజీనామా చేశారు. జనసేన ఏర్పడినప్పటినుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయబాబు రాజీనామా పార్టీ వర్గాల్లో  కలకలం రేపింది. అయితే వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈయన రాజీనామాకు కారణాలు ఒకటి రెండు రోజుల్లో స్పష్టమవుతాయని భావిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *