తల్లి చనిపోయినా..నవ్వుతూ పోజులా ?

మరణించిన తల్లి అంత్యక్రియలు జరిగి పది రోజులైనా కాలేదు. అప్పుడే గ్రాండ్ గా బర్త్ డే జరుపుకోవాలా ? పైగా నవ్వుతూ పోజులిస్తావా ? అంటూ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నెల 6 న జాన్వి తన 21 వ బర్త్ డేని జరుపుకొంది. ఆ సందర్భంగా ఆమె చెల్లెలు ఖుషి, బోనీ కపూర్ మొదటి భార్య కూతురు అంశుల, ఇంకా సోనమ్ వంటి బంధువ్లులతో కలిసి చిరునవ్వులు నవ్వుతూ గ్రూప్ ఫోటోలు దిగింది. ఇవి వైరల్ అయ్యాయి. దీంతో నెట్ లో జాన్వి నిర్వాకంపై అనేకమంది తూర్పారబడుతున్నారు. తల్లి చనిపోయిన బాధ నీలో కనిపించడం లేదు.

View this post on Instagram

?

A post shared by Anshula Kapoor (@anshulakapoor) on


పుట్టిన రోజు జరుపుకోవడానికి ఎందుకంత తొందర ? ఈ సెలబ్రేషన్స్ ని వాయిదా వేసుకోలేవా ? పైగా ఈ పిక్స్ ని సోషల్ మీడియాలో ప్రముఖంగా పోస్ట్ చేస్తావా ? అంటూ అనేకమంది కసిగా కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 24 న శ్రీదేవి దుబాయ్ లోని హోటల్లో బాత్ టబ్ లో మునిగి మరణించగా..28 న అంత్యక్రియలు జరిగిన సంగతి తెలిసిందే. ఆమె అస్థికలను భర్త బోనీకపూర్ ఇటీవలే రామేశ్వరంలో..సముద్రంలో నిమజ్జనం చేశారు.

ఇదిలాఉండగా, తమను ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్న తల్లి ఇక లేదన్న బాధను మర్చిపోయేందుకు జాన్వీ చాలా ప్రయత్నిస్తోంది. తనతల్లి.. అందాలతార శ్రీదేవి వారసురాలిగా త్వరలో వెండితెరపైకి రానున్న జాన్వీ కపూర్, తన మొదటి సినిమా ‘ధడక్’ షూటింగ్ కు తిరిగి వచ్చింది. తల్లి మరణించిన 10 రోజుల తరువాత జాన్వీ, సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది.

రెండు రోజుల క్రితం తన 21వ పుట్టిన రోజును జరుపుకున్న జాన్వీ, సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేసేందుకు పూర్తిగా సహకరిస్తానని చెప్పడంపై యూనిట్ సభ్యులు జాన్వీని ప్రసంశలతో ముంచెత్తుతున్నారు. మొదటి షెడ్యూల్ లో భాగంగా బాంద్రా ప్రాంతంలో జాన్వీ, ఈషాన్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే వారం నుంచి వీరిద్దరూ కోల్ కతాలో జరిగే షూటింగ్ లో పాల్గొంటారు.