అమెరికా, చైనా వంటి దేశాలు అంగారక, చంద్ర గ్రహాల మీద పరిశోధనల కోసం అంతరిక్ష నౌకలను పంపుతుంటే మేం మాత్రం తక్కువ తిన్నామా అంటోంది జపాన్. అయితే జపనీయులకు ఈ గ్రహాలపై కన్నా ఉల్కలు, తోకచుక్కల మీదే ‘ యావ ‘ ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకే ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ (ఫేక్) ఉల్కాపాతాలను సృష్టించేందుకు అక్కడి ఏరో స్పేస్ ఎక్స్ ప్లోరెషన్ ఏజన్సీ ఓ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపింది.

ఈ ‘ మ్యాన్ మేడ్ మీటియోర్ షవర్స్ ‘ సృష్టికి గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు గాను ‘ ఎప్సి లాన్ రాకెట్ # 4 ‘ ను ఈ సంస్థ ప్రయోగించింది. అంతా సవ్యంగా జరిగితే అంతరిక్షంలో ఈ రాకెట్ మీడియం సైజు పెల్లెట్లను మండిస్తుందట. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని జరిపేందుకు లక్షలాది పౌండ్లు వ్యయమవుతాయని అంచనా వేస్తున్నారు. సహజ సిద్ధమైన ఉల్కల కన్నా ఈ ఫేక్ మెటీయోర్స్ చాలా ‘ సుపర్బ్ ‘ గా ఉంటాయని, నింగిలో ఎక్కువసేపు కనబడుతాయని టోక్యోలోని ఏస్ట్రో లైవ్ ఎక్స్ పీరియెన్సెస్ సంస్థ పేర్కొంది. ఓ పెద్ద పెట్టె ఆకారంలో ఉన్న ఈ స్పేస్ క్రాఫ్ట్ ని తమ ఏజెన్సీకి అనుబంధంగా ఉన్న కక్ష్యలోకి పంపినట్టు ఈ సంస్థ సీఈఓ లీనా ఒకజిమా తెలిపారు.

మొట్టమొదటి కృత్రిమ ఉల్క ఈ కొత్త సంవత్సరంలో హిరోషిమాపై కనిపించవచ్చునన్నారు. సైన్స్ లో సరికొత్త విషయాలను కనుగొనేందుకు మా ఫేక్ ఉల్కలు తోడ్పడతాయని భావిస్తున్నామన్నారు. రాత్రి వేళ నక్షత్ర పుంజాలుగా కనిపించే ఇవి ప్రజలకు సంభ్రమాశ్చర్యాలు కలుగజేస్తాయని లీనా పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి జపాన్ లో సుమారు 60 లక్షలమంది వీటిని చూడవచ్చు.. అన్ని వైపుల నుంచి 62 మైళ్ళ వరకు ఈ నకిలీ ఉల్కాపాతాలు కనిపిస్తాయి అని లీనా అన్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *