వ్యాపారవేత్త జయరాం హత్య కేసు పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తు బాధ్యత తెలంగాణ పోలీసుల చేతుల్లోకి చేరడంతోనే.. డొంక కదలడం మొదలైంది. తాజాగా ఈ హత్యకు రాజకీయ రంగు అంటుకుంది. ఇప్పటికే ఐదుగురు పోలీసు అధికారులు హంతకుడికి సహకరించినట్లు ఆధారాలు దొరికాయి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడితో కూడా ఈ హత్యకు ప్రమేయం ఉందన్న సందేహం పోలీసులకొచ్చింది.

ఇప్పటివరకు దాదాపు 50 మందిని విచారించిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్‌కి నోటీసులు పంపారు. ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశించారు. హత్య చేసింది తానేనని అంగీకరించిన రాకేష్‌కీ, కూన శ్రీశైలం గౌడ్‌కీ వున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. హత్యకు రెండురోజుల ముందు నిందితుడు రాకేష్.. కూన శ్రీశైలం గౌడ్‌తో టచ్‌లో ఉన్నట్లు ఫోన్ కాల్ డేటా ద్వారా పసిగట్టారు. ఇటీవల శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *