సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆదివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఒక మార్పుకోసం పవన్ కళ్యాణ్ వచ్చారని, జనసైనికుల్లో తానూ ఓ సైనికుడిగా మారానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సేనాధిపతి మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తామని, ఈ పార్టీలో పని చేసే అవకాశమిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జనసేన నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయవచ్చునని తెలుస్తోంది. కాగా-తమ పార్టీలో లక్ష్మీనారాయణ చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో ఆయన రాయలసీమ నుంచి ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని తాను భావిస్తున్నట్టు పవన్ తెలిపారు. మా పార్టీకి వామ పక్షాలతో బాటు బీఎస్పీ‌తో పొత్తు ఉంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీలతో చర్చలు జరుపుతాను  అని ఆయన చెప్పాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *