అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద తన వ్యంగ్య కార్టూన్లతో విరుచుక పడుతున్నాడు నటుడు, కమెడియన్, కార్టూనిస్ట్ కూడా అయిన జిమ్ క్యారీ ! సమయం దొరికినప్పుడల్లా ఈ కార్టూన్లతో ఆయనపై అక్కసు వెలిగక్కుతూ పాపులర్ అయిపోయాడు. తాజాగా-అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టితీరుతానని, అవసరమైతే ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) ప్రకటిస్తానని బెదరగొడుతున్న  ట్రంప్ మహాశయుడ్ని క్యారీ చెండాడేశాడు.

1946‌లో న్యూయార్క్ లోని క్వీన్స్‌లో గల జమైకా హాస్పిటల్ మెడికల్ సెంటర్‌లో ట్రంప్ పుట్టినప్పుడే  రియల్ ఎస్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ‘ ప్రారంభమైంది ‘అంటూ సెటైరికల్ గా క్యారీ..కార్టూన్ వేశాడు. అయితే ఆ పుట్టుక మాత్రం మనుషులది కాదు అని కూడా కామెంట్ జోడించాడు.  ఇంధన విషయాలు, క్లైమేట్ చేంజ్, ప్రభుత్వ షట్ డౌన్ వంటి అంశాలపై డొనాల్డ్ గారు చేస్తున్న ప్రకటనలను క్యారీ తన ఇష్టం వచ్చినట్టు కార్టూన్ల ద్వారా రకరకాల వ్యంగ్య చమక్కులతో చురుక్కుమనిపిస్తున్నాడు. ఓ పత్రికలో ప్రచురితమైన అతని కార్టూన్లలో కొన్ని  మచ్చుకు ఇలా ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *