ఏదో విధంగా వార్తల్లోకి వస్తున్నారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. తాజాగా ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న ఆయన..కారులో ట్రావెల్ చేస్తూ విచిత్రంగా వ్యవహరించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శుక్రవారం కారులో వెళ్తుండగా, పాల్‌ను చూసిన కొంతమంది అభిమానులు ఆయనను పలకరించారు. ముందు సీటులో కూర్చున్న పాల్.. వాహనదారులు తనను పలకరించగానే ఎక్కడలేని ఆనందంతో పొంగిపోయారు.

మైక్ టైసన్ మాదిరిగా గాల్లోకి పిడిగుద్దులు విసరడం మొదలుపెట్టారు. అంతేకాదు పంచ్‌లు విసురుతూ నానాహంగామా చేశారు. వాహనదారుల్లో ఒకరు పాల్ కామెడీ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *