కాశ్మీర్‌లో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయాలన్న తన వ్యాఖ్యలు ఇప్పటివి కావని ప్రముఖ నటుడు కమల్ హసన్ అన్నారు. ప్లెబిసైట్..ప్రజాభిప్రాయ సేకరణ అన్నది ఇప్పుడు అవసరం లేదని, కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఆయన చెప్పారు. అసలే పుల్వామా ఘటన, పాకిస్తాన్ పై  చైనా మినహా దాదాపు అన్ని దేశాలూ మండిపడుతున్న వేళ.. ఈ నటుడు మొదట చేసిన వ్యాఖ్యలపై పలువురు భగ్గుమనడంతో ఆయన తన ‘గొంతు’  సవరించుకున్నారు.
గతంలో….కొన్ని దశాబ్దాల క్రితం తాను ‘మయ్యం’  అనే మ్యాగజైన్‌ని నిర్వహించినప్పుడు.. కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని అభిప్రాయపడ్డానని, అంతే తప్ప..ప్రస్తుతానికి అది అన్వయించదని ఆయన క్లారిఫై చేశారు. ఏమైనా..భారత, పాకిస్తాన్ దేశాలు సరిగా  ప్రవర్తిస్తే  నియంత్రణ రేఖ వద్ద ఎలాంటి సమస్యా ఉండదని, పైగా ఏ సైనికుడూ మరణించే పరిస్థితి కూడా తలెత్తదని కమల్ వ్యాఖ్యానించాడు. తన కామెంట్స్‌ని కొన్ని వర్గాలు వక్రీకరించాయన్న ధోరణిలో ఆయన  మాట్లాడారు.