తమిళనాడులో మెల్లగా లోక్‌సభ ఎన్నికల సందడి మొదలవుతోంది. సీనియర్ నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్..తమిళనాడు. పుదుచ్చేరి ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాడు. 21 మంది అభ్యర్థులతో కూడిన ఈ లిస్టులో కమల్ పేరు మాత్రం లేదు.
అయితే మిగతా 19 నియోజకవర్గాలకు సంబంధించి రెండో జాబితాను కోయంబత్తూరులో ఆదివారం విడుదల చేస్తానని కమల్ ప్రకటించాడు. అవినీతి నిర్మూలన, గ్రామీణ తమిళనాడు అభివృద్ది పేరిట పార్టీ స్థాపించిన కమల్.. రెండు ద్రవిడ పార్టీల్లో దేనితోనూ పొత్తు పెట్టుకోలేదు. కాగా-సూపర్ స్టార్ రజనీకాంత్.. కమల్‌కి కంగ్రాట్స్ చెప్పగా, అందుకు ధన్యవాదాలు తెలిపిన ఈయన.. మీలాంటి  మంచివాళ్ల  మద్దతు ఉంటే  ఈ రాష్ట్రంలో అన్ని లోక్‌సభ స్థానాలూ (40) మనవేనన్నాడు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *