దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్‌హాసన్- శంకర్ కాంబో మొదలైంది. ఈ ఫిల్మ్ పూజా కార్యక్రమాలు చెన్నైలో శుక్రవారం జరిగాయి. దీనికి ఇండస్ర్టీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అప్పట్లో వచ్చిన ‘భారతీయుడు’కి ఇది సీక్వెల్ మాత్రమే. తాజా లుక్‌లో ‘ఓల్డర్.. వైజర్.. డెడ్లియర్’ అన్న క్యాప్షన్స్‌తో మరింత పవర్ ఫుల్‌గా వున్నాడు కమల్. పూజా కార్యక్రమంలో కమల్‌ హాసన్‌ ఖాకీ దుస్తులు ధరించి ఉండటం విశేషం.

శనివారం నుంచి చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. కొంతపార్టు హైదరాబాద్‌లో, కీలక సన్నివేశాలను విదేశాల్లో తెరకెక్కించనున్నారు. కమల్ గెటప్ గతంలో కంటే ఇప్పుడు బాగుందనే ఒపీనియన్‌ని వ్యక్తంచేస్తున్నారు సినీ లవర్స్.

తాను కాలేజీలో చేరే సమయంలో కుల, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ తీసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే, కొంతమంది అధికారులు తనను లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఈ ఘటనే భారతీయుడు సినిమా తీసేలా చేసిందన్నాడు దర్శకుడు శంకర్. కమల్‌‌కు జోడీగా కాజల్‌ నటించనున్న ఈ ప్రాజెక్టుని లైకా ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *