ఆధ్యాత్మిక ‘ప్రపంచం’లో కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఆధ్యాత్మిక ప్రపంచం’లో నిమగ్నమైంది. బాలీవుడ్ వాల్డ్ సందడికి దూరంగా.. ఏకాంతంగా ‘ ధ్యాన ముద్రలో గడుపుతోంది. తన ‘ మణికర్ణిక ‘ చిత్రం షూటింగ్‌లో కాస్త తీరిక దొరకగానే ‘ ఐహిక లోకమే ‘ తనదిగా అనుభూతి చెందుతోంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే..ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తమిళనాడు..కోయంబత్తూరులో జరుగుతోంది.


అక్కడి సుప్రసిద్ధ ఆదియోగి ఆశ్రమాన్ని విజిట్ చేసిన ఈమె.. ధ్యానలింగం వద్ద ప్రార్ధనలు చేయడం, దేవుడి ఆశీస్సుల కోసమా అన్నట్టు ఆ ప్రశాంత వాతావరణంలో గడపడం కెమెరాలకెక్కింది. ఇంతేకాదు.. పిల్లలంటే ఎంతో ఇష్టపడే కంగనా..ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న స్కూలుకు కూడా వెళ్లి చిన్నారిబాలలతో సరదాగా ఆడిపాడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.


ముంబై బాలీవుడ్‌ని దాదాపు ‘ శాసించే ‘ స్థాయికి ఎదిగిన ఈ తార..భక్తి తత్వాలను ప్రశంసించని వాళ్ళు లేరు. తన తాజా ఫోటోలను కంగనా… తన అభిమానులకోసం ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసి వాళ్ళని సంతోషపెట్టింది.