కాంగ్రెస్ కే కన్నడిగుల ఓటు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే కన్నడిగులు మొగ్గుచూపారన్నది సుస్పష్టంగా ఉంది. వంద పైచిలుకు నియోజకవర్గాల్లో విజయం సాధించి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చినా అత్యధికంగా ఓట్లు దక్కించుంది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అన్నది అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాక్షాత్తూ ఎన్నికల సంఘం తెలిపిన ఓటింగ్ శాతం వివరాలు చూస్తే, ఔనా.. అనాల్సిన పరిస్థితి. ఈ లెక్కల ప్రకారం వివిధ పార్టీలకు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లశాతం, ఓట్లు ఇలా ఉన్నాయి.

 

Party {Votes%,Vote Count}
INC {37.9%,136201…
BJP {36.2%,129843…
JD(S) {18.5%,66256…
IND {4.0%,1431119}
BSP {0.3%,108589}
AIMEP {0.3%,97339}
BPJP {0.2%,83071}
CPM {0.2%,80704}
SWARAJ {0.2%,794…
KPJP {0.2%,74183}
NOTA {0.9%,306872}

 

కాగా, కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పుడు 222 స్థానాలకు ఎన్నిక పోలింగ్ జరిగింది. బరిలో 2500 మందికి పైగా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 4.98 కోట్ల మంది ఓటర్లు (మహిళలు-2.44కోట్లు, పురుషులు-2.52కోట్లు, ట్రాన్స్ జెండర్స్-4552) ఉన్నారు. కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మరణించిన కారణంగా ఆ స్థానానికి, నకిలీ ఓటర్ ఐడీ కార్డుల వ్యవహారంలో ఆర్ఆర్ నగర్ (రాజరాజేశ్వరి నగర్) అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఆర్ఆర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికలను మే 28వ తేదీన నిర్వహించనుంది. మే 31న ఫలితాలు వెల్లడి కానున్నాయి.