బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్- మెహరీన్ కాంబోలో రానున్న సినిమా కవచం. డిసెంబర్ ఏడున అంటే శుక్రవారం తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అన్నిపనులు పూర్తికావడంతో ప్రమోషన్‌లో నిమగ్నమయ్యారు నటీనటులు. ఓ వైపు ఛానళ్లకు ఇంటర్వ్యూలు, మరోవైపు మేకింగ్ వీడియోలను రిలీజ్ చేస్తోంది యూనిట్. తాజాగా సినిమాలోని కొన్ని ఫైట్లకు సంబంధించిన సన్నివేశాలను విడుదల చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలంటే యాక్షన్ బాగా చేస్తాడంటే టాక్ అభిమానుల్లో వుంది. ఈ క్రమంలోనే ఈ వీడియోని రిలీజ్ చేసింది. ఆ సీన్స్‌పై ఓ లుక్కేద్దాం..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *