జగన్ ద్వారా ఆంధ్రా ఆస్తులపై కేసీఆర్ కన్నేశారని అన్నారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు. ఆ తరహా కుట్రలను చూస్తూ ఊరుకోబోమని నేతలతో శనివారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌‌లో చెప్పారు. తెలంగాణలో మాదిరిగా ఆంధ్రాను జగన్ ద్వారా డిక్టేట్ చేయడానికి కేసీఆర్ చూస్తున్నారని దుయ్యబట్టారు. కేసుల మాఫీ కోసం రాష్ర్టాన్ని జగన్.. కేసీఆర్‌కు అమ్మేస్తున్నారనే భావన ప్రజల్లో బలపడుతోందన్నారు. ఏపీ ఆస్తులపై కేసీఆర్ కన్నేయడమే మనకు ఏకపక్ష ఎన్నికలకు నాంది పలుకుతోందన్నారు. మోదీ, కేసీఆర్, జగన్‌లు మనపై పెత్తనం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్న చంద్రబాబు.. ఓటుతో గట్టి గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

ఆనాడు విభజన సందర్భంగా కాంగ్రెస్‌పై ఓటర్లు ఎంత కోపంతో వున్నారో, ఇప్పుడు వైసీపీ పైనా అదే భావనతో వున్నారని తెలియజేశారు బాబు. జగన్ ఒత్తిడితోనే వివేకా కూతురు తండ్రి చావుని రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారని అభిప్రాయపడ్డారు. జగన్ అతిపెద్ద అఫిడవిట్‌ను దాఖలు చేశారని, 31 కేసుల్లో నిందితుడిగా వున్నట్టు ఆయనే ఒప్పుకున్నారని పేర్కొన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *