300 మంది పండితులతో ఐదురోజుల పాటు తన ఫామ్‌హౌస్‌లో ‘మహా రుద్ర సహిత సహస్ర చండీయాగం’ మొదలుపెట్టేశారు కేసీఆర్. అనేకరకాల విమర్శలు ఎదురైనప్పటికీ అనుకున్నది పూర్తి చేసే పట్టుదల గల మనిషిగా కేసీఆర్.. ఈ యజ్ఞాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే గవర్నర్‌తో పాటు, సొంత పార్టీ కీలక నేతలందరికే ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి. ఐదురోజుల పాటు జరిగే యాగానికి ఒక్కోరోజు ఒక్కో విశిష్ట అతిధిని ఆహ్వానించేలా ప్లాన్ చేశారు. కేసీఆర్ హిట్‌లిస్ట్‌లో కొందరు జాతీయ నేతలు కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మరి.. చంద్రబాబు మాటేంటి?

2015 డిసెంబర్లో ఆయుత చండీయాగం నిర్వహించిన కేసీఆర్.. అప్పట్లో కూడా తనకు రాజకీయ శత్రువుగా వున్న చంద్రబాబును ఆహ్వానించారు. విజయవాడలోని బాబు నివాసానికి వెళ్లి.. పత్రిక ఇచ్చి యాగానికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానించారు కేసీఆర్. చంద్రబాబు కూడా ఎటువంటి భేషజాలకు పోకుండా కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించారు. ఇద్దరి పొలిటికల్ యావిగేషన్స్ వేర్వేరు అయినప్పటికీ.. నాటి యాగ క్రతువును ఆ విధంగా ముగించారు. మరికొంతమంది సర్‌ప్రైజ్ గెస్టుల్ని ఆహ్వానించి, అప్పట్లోనే ఏడు కోట్లు ఖర్చు పెట్టి యాగాన్ని నిర్విఘ్నంగా ముగించి వార్తల్లోకెక్కారు కేసీఆర్.

ధార్మిక, ఆధ్యాత్మిక అంశాల్లో గట్టి పట్టింపుతో వ్యవహరించడం కేసీఆర్ అలవాటు. మిగతా విషయాల్లో తన వైఖరి ఎలా వున్నప్పటికి.. ఈ ఫార్మాలిటీస్ దగ్గర మాత్రం రాజీ పడబోరన్న సర్టిఫికెట్ ఆయనకు ఎప్పట్నుంచో వుంది. బీజేపీ సీనియర్ నేత, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని యాగానికి పిలవనున్న కేసీఆర్.. మరో నాయుడిని మాత్రం ఎందుకు ఉపేక్షిస్తారు? అన్న సందేహం తెలంగాణ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటివరకూ చంద్రబాబు ఇన్విటేషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ .. కేసీఆర్ నుంచి షాకింగ్ డెషిషన్ ఏదైనా వచ్చే అవకాశం వుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఉప్పు-నిప్పులా మారిన బాబు-కేసీఆర్.. ‘మరొక్కసారి’ ఒకటే ఫ్రేమ్‌లో దొరికితే బాగుండునని పొలిటికల్ వర్గాలు ఆబగా ఎదురుచూస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *