కేరళలో శబరిమల వివాదం తరువాత తాజాగా దాదాపు అలాంటి పరిస్థితే అక్కడి అగస్త్యకూడెం ప్రాంతంలో నెలకొంది. అతి ఎత్తయిన కొండ ప్రదేశంలో ఉన్న అగస్త్య ఆలయానికి చేరుకోవాలంటే ఇప్పటివరకు మహిళలకు నిషేధం ఉంటూ వచ్చేది.

అయితే కేరళ హైకోర్టు ఇటీవలే ఈ బ్యాన్ ఎత్తివేయడంతో మహిళలంతా.. 1868 మీటర్ల ఎత్తునున్న ఈ టెంపుల్ కు చేరుకునేందుకు బారులు తీరారు. ఫస్ట్ బ్యాచ్ లో 100 మంది మహిళలు అక్కడి ‘ బొనక్కాడ్ ‘ బేస్ క్యాంపు చేరుకోగా.. ధన్యా సనాల్ అనే యువతి  ఈ  క్యాంపు నుంచి బయలుదేరి కొండను ఎక్కేసింది.

సమాచార, ప్రసార శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈమె,,ఈ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి మహిళ అయింది. ఈమెతో బాటు మరికొందరు మహిళలు ‘ అతిరుమల లోని మరో బేస్ క్యాంపును 7 గంటల అనంతరం చేరుకోగలిగారు. ఇతర కొండలకన్నా అగస్త్యకూడెం హిల్ ఎక్కడం అతి కష్టసాధ్యమని సనాల్ తెలిపింది.

 

కాగా..  కోర్టు ఉత్తర్వులు రాకముందు ఈ కొండ బేస్ క్యాంపు వరకే మహిళలను అనుమతించేవారని,  కానీ నిషేధాన్ని తొలగించాక పెద్ద సంఖ్యలో వచ్చే మహిళా భక్తులతో ఇక్కడ రద్దీ ఏర్పడుతుందని, శబరిమల వద్ద తలెత్తిన పరిస్థితే ఇక్కడా ఏర్పడుతుందని ఇక్కడి ‘ కాణీ ‘ తెగ వాసులు భయపడుతున్నారు. పైగా ఇది అగస్త్య మునికి అపచారం చేసినట్టేనని వారు భావిస్తున్నారు. మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ‘ నామజపాలు ‘, ఇతర నిరసనలు చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *