ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ విరుచుకుపడ్డారు. చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి ఎక్కడా లేరంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తీవ్రపదజాలం వాడుతూ అనేక ఆరోపణలు చేశారు. బాబు గురించి పిల్లనిచ్చిన మామ ఎన్నో చెప్పారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో నాలుగేళ్లు సంసారం చేశారంటూ విమర్శించారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎన్నికలలో గుడ్డలూడదీసి పంపారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు ఎప్పుడు దిగిపోతాడా అని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకుంటున్నారని మమ్మల్ని విమర్శిస్తున్నారు.. మరి మీరు 365 రోజులు అసెంబ్లీలోనే ఉండి జీతాలు తీసుకుంటున్నారా? మీరు ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీకి వెళ్లని మిగిలిన రోజులకు మీరు జీతాలు ఇచ్చేస్తే మేం కూడా జీతాలు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నామని నాని అన్నారు. చంద్రబాబూ.. నీ టైమ్ అయిపోయింది అంటూ కొడాలి నాని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *