మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. జగన్‌ను కలిసిన రెండురోజులకే అంటే సోమవారం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. కొణతాల అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంపై పొలిటికల్‌ సర్కిల్‌లో ఆసక్తిమైన కథనాలు వినిపిస్తున్నాయి. మూడురోజుల కిందట లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిశారు కొణతాల. ఈ సమయంలో తనమీద వున్న సస్పెన్షన్ ఎత్తివేయాలని జగన్‌ను ఆయన కోరారు. ఆ విషయం తర్వాత చూసుకుందామని.. ముందు కండువా కప్పుకోవాలని జగన్ చెప్పడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు కొణతాల.

సోమవారం ఉదయం సీఎం చంద్రబాబుతో కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల సేపు నేతలు మాట్లాడుకున్నారు. కొణతాల ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని కొణతాల రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా పార్టీలో చేరాలని సీఎంకు చెప్పినట్టు పార్టీ వర్గాలంటున్నాయి. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆయన వెనుదిరిగినట్టు సమాచారం. అనకాపల్లి లోక్‌సభకు ఆడారి ఆనంద్‌ను ఎంపిక చేయాలని నియోజకవర్గాల నేతలు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. దీంతో కొణతాల ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారనేది ఆసక్తికరం! విశాఖ లోక్‌సభకు బాలకృష్ణ చిన్నల్లుడు రేసులో వున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *