ఒక్కోసారి ఇంటర్నేషనల్ క్రికెట్ కంటే గల్లీ క్రికెట్టే చూడ్డానికి భలే ముచ్చటేస్తుంది. కుర్రకారు సీరియస్‌గా ఆడే ఈ సిల్లీ గేమ్ నుంచి కళ్ళు తిప్పుకోవాలనిపించదు. అటువంటిదే ఒక క్రికెట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను దున్నేస్తోంది. కానీ.. ఈ క్రికెట్‌లో బాల్ ఉండదు.  కానీ.. బౌలింగ్ ఉంటుంది. భలే మజానిస్తుంది. సీనియర్ ఫిలిం టెక్నీషియన్ సెంథిల్ కుమార్ పోస్ట్ చేసిన ఈ క్రికెట్ ఫ్లిక్ అటుతిరిగి ఇటుతిరిగి.. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాకా వచ్చేసింది. అలా చూశాడో లేదో ఇలా అందిపుచ్చుకుని రీట్వీట్ చేశాడు కేటీఆర్. ఈ మధ్యకాలంలో ఇంతటి టాలెంటెడ్ బౌలర్‌ని ఎక్కడా చూడలేదు అంటూ ఓ కుర్రకుంకకు సర్టిఫికెట్ ఇచ్చేశాడు. ఇంతకీ ఏమిటా గొప్ప చిత్రం.. భళారే విచిత్రం..!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *