తెలంగాణా ఎన్నికల్లో 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారన్న లగడపాటి రాజగోపాల్ జోస్యాన్ని తెలంగాణా మంత్రి కెటీఆర్ కొట్టి పారేశారు. ఈ సర్వే ఓ జోక్ అన్నారు. పార్లమెంటులో లగడపాటి చేష్టలు తెలంగాణా రాకుండా ఆపలేక పోయాయని, లగడపాటి ఫేక్ సర్వేలు చతికిలపడతాయని  అయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్నప్పటికీ.. ఆదివారం ఆయన నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా స్పందించారు. ‘ శంకర్..2.0 ‘, రాజమౌళి..బాహుబలి, చంద్రబాబు అమరావతి వీ ఎఫ్ ఎక్స్ గ్రాఫిక్స్ లో ఏది బెస్ట్ అన్న ప్రశ్నకు..55 శాతం మంది బాబు గ్రాఫిక్స్ బెస్ట్ అని బదులిచ్చిన పోల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసిన ఓ నెటిజన్..వీటిలో మీ ఆప్షన్ ఏమిటని ప్రశ్నించగా.. నేను ఒప్పుకుంటున్నా అని కేటీఆర్ సమాధానమిచ్చారు.  తాము అధికారంలోకి వస్తే ఒకేసారి రూ. 2 లక్షలకోట్ల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ గురించి ఒకరు అడగ్గా..ముందు వారిచ్చిన ఈ హామీని కర్ణాటకలో అమలు చేయాలని కేటీఆర్ అన్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *