తెలంగాణా ఎన్నికల్లో ప్రజాకూటమి గెలుస్తుందని తన సర్వేలో తేలినట్టు చెప్పి అభాసు పాలైన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..దీనిపై సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు నో కామెంట్ అన్నారు శనివారం కుటుంబసభ్యులతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఈ ఫలితాల ప్రస్తావన తేగా..రాజకీయాల గురించి తిరుపతిలో మాట్లాడకూడదని అనుకుంటూనే ఈ మధ్య మాట్లాడేశానని, అదే పెద్ద పొరబాటైందని అన్నారు.

నిజానికి ఇక్కడ నేనెప్పుడూ పాలిటిక్స్ గురించి మాట్లాడను. కానీ ఇటీవల మీ అందర్నీ చూసి ఆగలేక నా సర్వే గురించి మాట్లాడాను. అలా చేయడం పొరబాటే అని పేర్కొన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించి మరో మిస్టేక్ చేయను అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా విసవిసా వెళ్ళిపోయారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *