మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ దర్శనమిచ్చారు. శుక్రవారం అమరావతిలో సీఎం చంద్రబాబును ఆయన కలిశారు. నేతలిద్దరూ అరగంట పాటు రాష్ర్ట, దేశ రాజకీయాలపై ప్రధానంగా చర్చించారు. సిట్టింగుల్లో కొంతమందిని మార్చితే బాగుంటుందని బాబుతో లగడపాటి అన్నట్లు ఓ వార్త హంగామా చేస్తోంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన లగడపాటి, ఈనెల 27న తమ కుటుంబంలో జరగనున్న శుభకార్యానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్టు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్‌పై తాను ఇప్పుడేమీ వ్యాఖ్యానించనని అన్నారు. రాజకీయాలపై మాట్లాడేందుకు ఇది సరైన సమయంకాదని చెప్పి, అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు లగడపాటి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *