ఎన్నికల ముందు తన సర్వేలతో అన్ని పార్టీల్లో సస్పెన్స్ సృష్టిస్తున్న లగడపాటి రాజగోపాల్ తన కొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఏ పార్టీలోనూ చేరనని అన్నారు. పైగా ఇక తన వ్యాపారాలేవో తాను చేసుకుంటానని స్పష్టం చేశారు.

ఆయన ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారన్నది అందర్నీ..ముఖ్యంగా ప్రధాన రాజకీయపార్టీలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ..లగడపాటి మళ్ళీ తన ‘ సర్వేల ‘ అస్త్రాన్ని బయటకు తీసే అవకాశామూలేకపోలేదనే వ్యాఖ్యలూ వినబడుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *