వదల బొమ్మాళి అంటూ ‘అరుంధతి’లో జేజమ్మను వణికించిన డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్.. మరోసారి తన విశ్వరూపం చూపెట్టనున్నాడు. సాయికుమార్ సోదరుడైన రవిశంకర్.. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ వర్మతో చేతులు కలిపేశాడు. భయపెట్టి చంపేంత గద్గద స్వరమే రవిశంకర్ స్పెషాలిటీ. అతడి గొంతును తన ‘లక్ష్మీస్ ఎన్టీయార్’లో ఒక పాట కోసం వాడుకుని తెగ మురిసిపోతున్నాడు వర్మ. ‘సింహగర్జన’ లీడ్‌తో సాగే ఎమోషనల్ సాంగ్‌కి సిరాశ్రీ లిరిక్స్ ఇవ్వగా, కళ్యాణ్ మాలిక్ ట్యూన్స్ కట్టాడు. పిచ్చెక్కించేంత బిగ్గరగా సెంట్ పర్సెంట్ ఫీల్‌తో పాడిన రవిశంకర్‌ని వర్మ ఆకాశానికెత్తేశాడు! ఈ మూవీలో రవిశంకర్ ఒక కీలక రోల్ కూడా చేయనున్నట్లు యూనిట్ చెబుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *