‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఫిల్మ్ రిలీజ్ కాకుండా అడ్డుకునేందుకు సెన్సార్‌ బోర్డు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. దీనిపై న్యాయస్థానానికి వెళ్తున్నట్లు తెలిపాడు. ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం ఈనెల 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇటీవలే యూనిట్.. సెన్సార్‌ కోసం సినిమాను బోర్డుకు పంపింది. తొలి దశ ఎన్నికలు పూర్తయ్యేవరకు మూవీని పరిశీలించడం సాధ్యంకాదని ఆయనకు సెన్సార్‌ బోర్డు ఓ లేఖ పంపింది. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల వాయిదా పడినట్టే!

మరోవైపు సెన్సార్‌ బోర్డు లేఖపై స్పందించాడు రామ్‌గోపాల్‌ వర్మ. ‘ఎన్నికల కోడ్‌ పేరిట సినిమా సెన్సార్‌ స్క్రీనింగ్‌ని వాయిదా వేసే అధికారం బోర్డుకి లేదన్నాడు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించడమేనని, ఏ రాజకీయ పార్టీతోనూ మా సినిమాకి సంబంధం లేదంటున్నాడు. మూవీని చూడకముందే ఎన్నికల నియమావళి పేరిట సినిమా రిలీజ్‌ను ఆలస్యం చేసే అధికారం సెన్సార్‌ బోర్డుకి లేదన్నాడు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతలోనే ఆదివారం రాత్రి ట్వీట్‌ చేసిన వర్మ, సెన్సార్‌ బోర్డుతో మాకున్న అపార్థాలు తొలగిపోయాయని, సెన్సార్‌ అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపాడు.

మూవీని సెన్సార్ బోర్డు ఆపడంపై బయ్యర్లు లబోదిబోమంటున్నారు. ఎన్నికల తర్వాత ఈ చిత్రాన్ని ఎవరూ చూడరని, ఎన్నికల ముందు వస్తుందంటేనే తాము కొనుగోలు చేశామని అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *