ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గకుండా వుండేలా ప్లాన్ చేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ. ఇందులోభాగంగా శుక్రవారం మరో ట్రైలర్‌ని రిలీజ్ చేశాడు. రెండున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్‌లో ‘వాడూ.. నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు’ అన్న ఎన్టీఆర్ మాటతో ప్రారంభమైంది. ‘నేను… నేను కాను… నేను.. నా ప్రజలు, నా ప్రజలే నన్నింతటి వాడ్ని చేశారు.. ఇప్పుడు వాళ్లే నన్ను వద్దు అనుకుని ఆ పవర్‌ని వెనక్కి తీసుకున్నారు’ అన్న ఎన్టీఆర్ డైలాగ్ తో ప్రారంభమైంది.

శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి మహామహా అందగత్తెలతో పరిచయమున్న ఆయనకు, దానిలో
ఏముందనో.. ఎన్టీఆర్ కూతుళ్ల డైలాగ్స్. మొదట వచ్చిన ట్రైలర్‌లో విజువల్స్ ఎక్కువగా కనిపించాయి. కేవలం డైలాగ్స్‌ కోసమే వర్మ రిలీజ్ చేసినట్టు కనిపిస్తోంది. చివరగా వెన్ను పోటు పొడిచారు.. మన దగ్గర నిజం వుంది, నిజాన్ని ఎవరూ ఆపలేరు అన్న ఎన్టీఆర్ డైలాగ్‌తో ముగింపు ఇచ్చాడు వర్మ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *