లక్ష్మీస్ ఎన్టీఆర్  చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సినిమాను మార్చి 29‌న రిలీజ్ చేయనున్నట్టు దర్శకుడు రాం గోపాల్ వర్మ ప్రకటించాడు. నిజానికి ఈ నెల 22 న ఈ మూవీ విడుదల కావలసి ఉంది. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రాన్ని విడుదల చేయరాదని టీడీపీ కార్యకర్తలు కొందరు ఈసీకి ఫిర్యాదు చేశారు.

దీంతో సినిమా విడుదలను నిలిపివేయాలని సెన్సార్ బోర్డు చిత్రం యూనిట్‌ని ఆదేశించింది. కానీ పట్టు వదలని వర్మ.. సెన్సార్ బోర్డుతో చర్చలు జరిపి..ఇందులో వివాదాంశాలు ఏవీ లేవని నచ్చజెప్పి  విడుదలకు మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. రిలీజ్ తేదీని 29‌కి మార్చాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *