పరిటాల రవి అనుచరుడు చమన్ మృతి

టీడీపీ దివంగత నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు, మాజీ జెడ్పీ చైర్మన్ చమన్ (58) గుండెపోటుతో మరణించారు. సోమవారం అనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. ఆయన మృతి వార్త తెలిసినవెంటనే మంత్రి పరిటాల సునీత హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.

చమన్ మృతితో ఆమె కన్నీటిపర్యంతమై స్పృహ తప్పి పడిపోయారు. ఆదివారం వెంకటాపురంలో జరిగిన పరిటాల రవి, సునీతల కుమార్తె స్నేహలత వివాహానికి కూడా హాజరైన చమన్ హఠాన్మరణం టీడీపీ శ్రేణులను షాక్ కి గురి చేసింది.

చమన్ 2014 నుంచి 2017 మే వరకు అనంతపురం జెడ్పీ చైర్మన్ గా వ్యవహరించారు. 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో సుమారు ఎనిమిదేళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. 2012 లో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014 లో టీడీపీ అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి ఈ పార్టీ తరఫున జెడ్పీటీసీ గా పోటీచేసి గెలిచారు.