బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారా? అవుననే అంటున్నాయి ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా వుండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలు చాలానే వున్నాయి. వయసు మీద పడడంతో రాజకీయాలకు దూరంగా వుండాలని ఆయన భావిస్తున్నారు. అదే జరిగితే బీజేపీలో అద్వానీ శకం దాదాపుగా ముగిసినట్టే! గతవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. అద్వానీని కలిసి, 2019 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి పోటీ చేయాలని కోరారట, అందుకు ఆయన నిరాకరించారన్నది ప్రధాన వార్త.

కూతురు ప్రతిభ లేదా కొడుకు జయంత్‌ని గానీ ఎవరో ఒకరిని గాంధీనగర్ నుంచి బరిలో దింపాలని, వారిని గెలిపించే బాధ్యతను తాము తీసుకుంటామని విజ్ఞప్తి చేశారట. అందుకు అద్వానీ నిరాకరించారని తెలుస్తోంది. నిజానికి 2014 ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా వుండాలని అద్వానీ భావించారు. ఈలోగా బీజేపీ నేతలు రంగంలోకి దిగి ఆయనను కన్విన్స్ చేశారు. ఆ తర్వాత పార్టీలో అద్వానీకి ఎదురైన అనుభవాలు గురించి చెప్పనక్కర్లేదు. అందుకే తన పిల్లలను సైతం అద్వానీ రాజకీయాలకు దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *