దొడ్డిదారిన రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చరమగీతం పాడేందుకు నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఇవాళ మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేష్ దాఖలు చేశారు. ఉండవల్లిలోని తమ నివాసం నుంచి టీడీపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయల్దేరి మంగళగిరివెళ్లిన లోకేష్ స్థానిక రామాలయంలో పూజలు చేసిన అనంతరం నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ కూడా లోకేష్ వెంట ఉన్నారు. నామినేషన్ వేసేందుకు నివాసం నుంచి బయలుదేరే ముందు లోకేష్ తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముద్దుల కొడుకును తల్లి గారాబంగా ఆలింగనం చేసుకుంటే, ఆశీర్వాదం కోసం వంగిన లోకేష్ వైపుపై ప్రేమగా చరిచారు తండ్రి చంద్రబాబు. అనంతరం లోకేష్‌కు దిష్టి తీసి.. భార్య బ్రాహ్మణి ఎదురొచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *