దక్షిణ అయోధ్యగా కీర్తించబడే భద్రాచలం ఆలయంలో శ్రీరామచంద్రమూర్తివారి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా సాగింది. అశేష భక్తకోటి రామ నామ స్మరణ మధ్య మిథిల ప్రాంగణంలో శ్రీరామునిపట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఈ క్రతువులో వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యహోచనం చేసి, పవిత్ర నదీజలాలతో స్వామివారికి అభిషేకం జరిపించారు. తర్వాత అష్టోత్తర, సహస్త్ర నామార్చన, సువర్ణపుష్పార్చన గావించారు. వసంత రుతువులో ఛైత్రశుద్ధ నవమి రోజు కళ్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించే సంప్రదాయం భద్రాచలంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది.

స్వామివారికి పట్టాభిషేక మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు హాజరయ్యారు. సోమవారం ఉదయం హెలికాప్టర్ ద్వారా భద్రాచలం చేరుకున్న గవర్నర్ దంపతులు తొలుత సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మిథిల మైదానంలో జరిగిన పట్టాభిషేకంలో పాల్గొని, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇక, ఎక్కువసార్లు భద్రాచలంలో జరిగిన శ్రీరామపట్టాభిషేకానికి హాజరైన గవర్నర్‌గా నరసింహన్ గుర్తింపు పొందారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *