బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. హీరోలే కాదు హీరోయిన్లు కూడా కోరుకున్నవాడ్ని పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నారు. ఈ జాబితాలో సోనమ్ కపూర్, ప్రియాంకచోప్రా, దీపికా వంటివాళ్లు వున్నారు. తాజాగా తన మ్యారేజ్‌పై నోరు విప్పింది బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్. పెళ్లి విషయాన్ని దేవుడికే వదిలేశాను, లైఫ్‌లో మ‌న‌కు ఏది రాసుంటే అది జ‌రుగుతుందని, అందుకే ప్రశాంతంగా ఉండ‌గ‌లుగుతున్నానని వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను బయటపెట్టింది. వ‌చ్చే ఆలోచ‌న‌లు సాకారం కావని తేల్చి చెప్పేసింది. బాలీవుడ్‌లో కత్రినా ప్రేమాయణం గురించి చాలానే వార్తలొచ్చాయి. తొలుత సల్మాన్, ఆ తర్వాత రణబీర్ కొన్నాళ్లు ప్రేమాయ‌ణం సాగించింది. రెండేళ్ల కిందట రణబీర్‌తో ఆమె ల‌వ్‌కి బ్రేక్‌పడింది. ప్రస్తుతం రణ్‌బీర్.. అలియా భ‌ట్‌తో ప్రేమాయ‌ణంలో వున్న విషయం తెల్సిందే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *