అందుకే శ్రీరెడ్డిని అలాచేయాల్సి వచ్చింది: శివాజీ రాజా

అందుకే శ్రీరెడ్డిని అలాచేయాల్సి వచ్చింది: శివాజీ రాజా

‘మా’ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల పుణ్యమాని సినీనటుల్లోని వికృతరూపాలు బయటకొస్తున్నాయి. మాకంటే రాజకీయనేతలే చాలా బెటరనేలా ఉంటున్నాయి వీళ్ల చేష్టలు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కొత్తగా ఎన్నికైన ప్రతినిధులను ఎంతమాత్రం ఆహ్వానించలేకపోతున్నారు పాత బ్యాచ్. గత ఎన్నికల్లో ఓటమి పాలైన అప్పటి మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ చేష్టలకు సామాన్యజనం ముక్కునవేలేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించిన సంగతి తెలిసిందే. అదే సీన్ ఇప్పుడూ రిపీట్ అవుతోంది. తాజాగా జరిగిన మా ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్ వర్గానికి సాధ్యమైనంత ఇరుకున పెట్టేలా పాత అధ్యక్షుడు శివాజీరాజా పావులు కదుపుతున్నారు.

మీడియా ముందుకొచ్చి శివాజీ సంచలన విషయాలు బయటపెడుతున్నారు. తాజాగా ఆయన గతాన్ని కెక్కరించారు. ‘శ్రీరెడ్డికి మెంబర్ షిప్ ఇవ్వొద్దని అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్న నరేష్ చెప్పారు. దీంతో మెంబర్ షిప్ ఇవ్వకూడదని అందరం అనుకున్నాం. కాని పెద్దల నుండి మెంబర్ షిప్ ఇవ్వమని ఒత్తిడి వచ్చింది. ఆ కన్ఫ్యూజన్‌లో మెంటల్ బ్యాలెన్స్ లేక ఆ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ అప్పటి విషయాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు, గతంలో జీవిత ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి విషయంలోకాని.. డ్రగ్స్ విషయంలోకాని నువ్ సరిగా స్పందించలేదన్నారని అప్పటి చిట్టా విప్పారు. ‘కాని వాళ్ల బ్రదరే డ్రగ్స్ అమ్మాడని పేపర్‌, టీవీలతో వచ్చింది. వాటిపై నేనేం స్పందిస్తా అన్నారు శివాజీ రాజా. నిజంగా నరేష్‌కి స్త్రీలపై గౌరవం ఉంటే జీవితను ప్రెసిండెంట్ చేయొచ్చుకదా అని మరో చురకవేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *