శంభో శివశంభో మంత్రం భారతదేశంలోనేకాదు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ మారుమ్రోగింది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అమెరికాలోని భారతీయులు పరమశివుడ్ని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఉపవాసాలు, రాత్రంతా జాగారాలతో మహాశివుడ్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. నార్త్ కరొలినా రాష్ట్రంలోని కేరి నగరంలోని సాయిబాబా ఆలయంలో భారతీయ భక్తులు శివపార్వతుల కళ్యాణం.. అభిషేకం ఘట్టాలను భక్తిపారవశ్యంతో కన్నుల పండువగా జరిపించి తరించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *