కూతురు సితార అంటే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంతిష్టమో చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ తండ్రి తనకూతురి టాలెంట్ చూసి అబ్బురపడిపోయాడు. ‘బాహుబలి’ సినిమాలోని ‘ముకుంద..’ అనే పాటకు తన గారాలపట్టి చేసిన డ్యాన్స్‌కు ఫుల్ ఫిదా అయిపోయాడు. వాటే టాలెంట్ అంటూ కితాబిచ్చాడు. హ్యాష్ ట్యాగ్ జోడించి మై సీతా పాప అంటూ పోస్ట్ చేశాడు. ఈ ట్యాగ్ ఆలిండియా లెవెల్‌లో ట్రెండింగ్ కూడా అవ్వడం విశేషం. భరతనాట్యం కూడా నేర్చుకుంటున్న సితార ఇటీవల గజ్జెలు కట్టుకుని డ్యాన్స్ చేసిన తీరు చూసి అమ్మ నమ్రతా కూడా ఫుల్ హ్యాపీ అయిపోయిన సంగతి తెలిసిందే.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *