ఏప్రిల్ 25న మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ థియేటర్లకు రావడం ఖాయమైపోయింది. మరి.. ప్రిన్స్ చెయ్యబోయే తదుపరి సినిమా ఏంటి? అనే టాక్ ఫిలింనగర్‌ని ఇప్పటినుంచే పిచ్చెక్కిస్తోంది. అటు మహేష్ డేట్స్ కోసం నిర్మాతలు, ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సుకుమార్, సందీప్ వంగా, అనిల్ రావిపూడి మహేష్ నుంచి మాట తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ.. ఎవ్వరికి ఫైనల్ చేస్తాడనే సస్పెన్స్ మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయింది. సరిగ్గా ఈ గ్యాప్‌లోనే.. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ దూరేశాడు.

తరుణ్.. పిచ్చెక్కించే స్టోరీ ఒకటి నేరేట్ చేశాడని, ప్రిన్స్ కూడా దానికి ఫిదా అయిపోయాడని తెలుస్తోంది. కానీ.. అది వెబ్ సిరీస్ కోసం రాసుకున్న కథ అని, దాన్ని సినిమాగా ఎందుకు మలచకూడదు అని మహేష్ బాబు అడిగాడని చెబుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సొంత బేనర్ మీద ‘చార్లీ’ పేరుతో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. ఇప్పుడీ తరుణ్ భాస్కర్ కథను మహేష్ ఎలా వాడుకుంటాడన్న సందేహం అతడి అభిమానుల్ని వేధిస్తోంది. మహర్షి రిజల్ట్ మీద ఒకవైపు ఆసక్తి పెరుగుతుంటే.. మరోవైపు మహేష్ నెక్స్ట్ మూవీపై అంచనాలు వేడెక్కిస్తున్నాయి.

తరుణ్ భాస్కర్ ట్రాక్ కూడా అంత గొప్పగా లేదు. పెళ్లిచూపులు తర్వాత తను చేసిన ‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ అడ్డం తిరిగింది. అంతకుముందు.. అఖిల్ కోసం కూడా తరుణ్ ఒక సినిమా ప్లాన్ చేసినా, అది సెట్స్ మీదికెళ్ళకుండానే ఆగిపోయిందట. టాలీవుడ్ లో తరుణ్ మార్క్ వర్కవుటయ్యే సీజన్ పోయిందని, మహేష్ దూరంగా ఉంటే బెటరని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *