సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ప్రేమ వివాహానికి ఆదివారంతో 14 ఏళ్ళు గడిచాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని అందాల నటి  శృతి హసన్ షేర్ చేస్తూ.. ఫోటో అద్భుతం.. ఈ జంటకు 14‌వ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు.. మై లవ్ అంటూ ట్వీట్ చేసింది. గతంలో మహేష్-శృతి కాంబోలో వచ్చిన  ‘శ్రీమంతుడు’  చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మహేష్ ప్రస్తుతం  ‘మహర్షి’  సినిమాతో బిజీగా ఉన్నాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *