ముగ్గురూ పెద్ద నిర్మాతలే కావడం, వారిలో ఇద్దరు స్వతహాగానే డిస్ట్రిబ్యూటర్లవడం, సినిమా సమ్మర్లో రిలీజ్ అవుతుండడం.. వీటన్నిటికి తోడు మహేష్ బాబు స్టార్ వ్యాల్యూ తోడవడం.. ఇవన్నీ కలిసి ‘మహర్షి’ మూవీని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. సినిమా కంటెంట్ పరంగా కూడా బాగా స్టఫ్ ఉన్నట్లు తోచడంతో.. ప్రీ రిలీజ్ బిజినెస్ అదరహో స్థాయిలో జరుగుతోంది. మొత్తానికి.. విడుదలకు ముందే 150 కోట్ల మార్క్ ని దాటేసింది మహేష్ ‘మహర్షి’ మూవీ.

  • మహర్షి’ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 94.50 కోట్లు
  • శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ కలిపి రూ. 47 కోట్లు
  • ఓవర్సీస్ రైట్స్ రూ. 12.50 కోట్లు
  • కర్నాటక, తమిళనాడు, నార్త్ ఇండియా రూ. 10 కోట్లు

సీడెడ్, ఈస్ట్, వెస్ట్, నెల్లూరు ఏరియాల హక్కుల్ని నాన్ రికవరబుల్ అడ్వాన్స్ పద్ధతిలో అమ్మినట్లు చెబుతున్నారు. ఇక.. నైజాం, ఉత్తరాంధ్రలో దిల్ రాజు, కృష్ణ, గుంటూరు ఏరియాల్లో అశ్వినీదత్ సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. అయితే.. ప్రీరిలీజ్ లెక్కల్లో ‘భరత్ అనే నేను’, ‘స్పైడర్’ మూవీలను దాటకుండా నిర్మాతలు ‘జాగ్రత్త’ వహించినట్లు తెలుస్తోంది. మే 9న రిలీజయ్యే ‘మహర్షి’ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఫిమేల్ లీడ్ చేస్తున్న పూజ హెగ్డే.. ఇప్పటి నుంచే తన అందాల ఆరబోతతో.. మూవీని పరోక్షంగా ప్రమోట్ చేసుకుంటోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *