అఖిల్ అక్కినేనిది క్రేజీ క్యారెక్టర్ కాదు డేంజరస్ క్యారెక్టర్ ! ఈ విషయాన్ని తన ‘మిస్టర్ మజ్ను’ టీజర్ ద్వారా అభిమానులకు చెప్పుకున్నాడు ఈ సిసింద్రీ. మొదటి రెండు సినిమాలూ పేలవంగా ఆడడంతో.. ఈసారి కొట్టేది కొంచెం గట్టిగా ఉండాలన్న కసితో నటించాడు అఖిల్. ‘తొలి ప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో అఖిల్ నటిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ టీజర్ వచ్చేసింది. అక్కినేని ఫ్యాన్స్‌కి సంక్రాంతి పండగను ముందే తెచ్చేసిందన్న స్థాయిలో ఉందీ ముప్పావు నిమిషం టీజర్. ముందటి కంటే ఇంకాస్త ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు అఖిల్.

”ఆ రోజుల్లో చాక్లెట్లతో పనైపొయ్యేది.. ఇప్పుడుండే స్ట్రెస్ లెవల్స్‌కి హ్యూమన్ టచ్ కావాలి” అంటూ ఇందులో తన క్యారెక్టర్‌ని రివీల్ చేశాడు అఖిల్. ప్రపంచంలోని అమ్మాయిలందరూ తన కోసమే పుట్టారనుకునేంత రేంజ్‌లో వుండబోతోంది ఇందులో అఖిల్ చేయబోయే ‘అల్లరి’. యూత్‌ఫుల్ అండ్ రొమాంటిక్ మూవీస్ చేయడంలో దిట్టగా ప్రూవ్ చేసుకున్న వెంకీ అట్లూరి.. ‘తొలిప్రేమ’తో వరుణ్ తేజ్‌ని స్లంప్ నుంచి బైటపడేశాడు. ఇప్పుడు మిస్టర్ మజ్ను మూవీతో అఖిల్‌ని గట్టెక్కిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎస్వీసీసీ బేనర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తీస్తున్న ఈ మూవీ.. జనవరి 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *