నిన్న మొన్నటివరకు చిన్న పిల్లలా కనబడిన మలియా ఒబామా ఎంతగా ఎదిగిపోయింది ? గతంలో తండ్రి బరాక్ ఒబామా, తల్లి మిషెల్ ఒబామాల చాటున మీడియాకు, పబ్లిక్ ఫంక్షన్ల లోనూ కనబడీ కనబడనట్టు కనిపించిన మయామీ..ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి.. ఎవరి అండా లేకుండానే తానొక్కతే హాలిడే ట్రిప్ కు సై అంటోంది.

ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడైన బరాక్ ఒబామా గారాల కూతురు మలియా.. ఆదివారం మయామీ బీచ్ లో సేద దీరింది.

80 డిగ్రీల టెంపరేచర్ తో ఈ ప్రాంతం ఉడుకెత్తగా.. 80 డాలర్ల విలువైన ఏంజెల్ రోజ్ వైన్ తాగుతూ.. వీకెండ్ సరదాగా గడుపుతూ..కుర్రకారు టెంపరేచర్స్ ని తానూ మరింత హీటెక్కించింది. ఓ ఫైవ్ స్టార్ హోటల్..డీ ఓ రిసార్ట్ దగ్గర కనబడిన దృశ్యమిది.

హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న ఈ చిన్నది తన స్టడీస్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ఇలా ఇక్కడికొచ్చి కెమెరాల ‘ పంట పండించింది ‘.

అంతే కాదు..సన్ బాతర్స్ తో కలిసి తనూ స్విమ్ సూట్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ మలియా వావ్ అనిపించింది.

ఈమె బస చేసిన హోటల్ కు సాధారణంగా కిమ్ కర్దాషియాన్, ఆమె చెల్లెళ్ళు, పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ వంటి సెలబ్రిటీలు వస్తుంటారు. ఇప్పుడు వీళ్ళ జాబితాలో మలియా కూడా చేరిపోయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *