అతి భారీ తిమింగలం అతడ్ని హఠాత్తుగా మింగినంత పని చేసింది. దాని ‘ జా’ కు చిక్కి అరక్షణం పాటు విలవిలలాడాడు. తన ప్రాణం పోయిందనేఅనుకున్నాడు. అయితే ఆశ్చర్యం ! ఆ వేల్ అతడ్ని మింగకుండా వదిలేసింది. దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజెబెత్ హార్బర్ లో రైనర్ స్కింప్ అనే గజ ఈతగాడికి కలిగిన భయంకర అనుభవమిది !

సాధారణంగా తిమింగలాలు తమకు దొరికిన ఎరలను గుటుక్కున మింగేస్తాయి. సముద్రంలో మెల్లగా కదులుతూ ఆక్సిజన్ పీల్చుకోవడానికా అన్నట్టు అప్పుడప్పుడు పైకి సుమారు నాలుగైదు అడుగుల ఎత్తున ఉవ్వెత్తున లేచి తిరిగి నీటిలోకి జంప్ చేస్తాయి.

ఇటీవల డైవ్ టూర్ ఆపరేటర్ అయిన రైనర్.. సముద్రపు ఒడ్డునుంచి కొద్దిదూరం ఈదుకుంటూ వెళ్ళగానే.. ఓ తిమింగలం వేగంగా అతనివైపు వచ్చి..అతడు వెనక్కి వచ్చేంతలో.. నోటితో పట్టేసింది. ఇక తన పని అయిపోయిందని, తనను ఎక్కడో హిందూ మహాసముద్రంలో మళ్ళీ ‘ కక్కేస్తుందని ‘ రైనర్ భావించాడు. కానీ..అదృష్టవశాత్తూ ఆ వేల్ వెంటనే తన నోటినుంచి వదిలేసిందని చెబుతున్నాడు.

తిమింగలాలు మనుషులను కబళించవని , ఒక్కోసారి మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటాయని రైనర్ అంటున్నాడు. తనది ‘ లక్కీ బ్రేక్ ‘ అని అభివర్ణించాడు. సముద్రంలో సుమారు వెయ్యి అడుగులలోతువరకు వెళ్ళగలిగే వేల్స్ ప్రమాదకరంగా కనిపిస్తాయి గానీ.. మరీ అంత డేంజరస్ కావని తనకు కలిగిన అనుభవం నిరూపిస్తోందని రైనర్ చిరునవ్వులు చిందిస్తూ చెప్పాడు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *